కర్నూలు టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కొందరు ఎమ్మెల్యేలు, ఇంఛార్జీల పేర్లు చెప్పుకొని కార్యకర్తలతో డబ్బులు వసూలు చేస్తున్నారని బాంబ్ పేల్చారు. లోకేష్ , చంద్రబాబు రెక్కల కష్టంతో అధికారం తెస్తే ఇలా చేస్తారా అంటూ నిలదీశారు. సొంత పార్టీ కార్యకర్తలతో లంచాలు తీసుకొని డీలర్ షిప్ లు ఇస్తారా….అని ఫైర్ అయ్యారు.
ఈ తతంగం చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ కు తెలిస్తే ఎంత బాధ పడతారని తెలిపారు. సమన్వయంతో వెళ్లాల్సిన అవసరం లేదా అని నిలదీశారు. ఎవరు ఎలా పని చేసారో చూడొద్దా…. నిన్న మొన్న వైసీపీ నుంచి వచ్చిన వాళ్లకు ప్రాధాన్యత ఇస్తారా…? అంటూ ప్రశ్నించారు. ఎంపీటీసీ గా ఉన్న బిసి ని డ్2ఎంపీ గా గెలిపిస్తే ఆయనను కట్టడి చేస్తారా..ఎంపీ గా వుంటూ సిఫార్సు చేస్తే ప్రశ్నిస్తారా…బిసి నేతను కట్టడి చేస్తారా అంటూ ఫైర్ అయ్యారు.
అందుకేనా లోకేష్ పాదయాత్ర చేసింది, చంద్రబాబు జైలుకు వెళ్ళింది అందుకేనా ? అంటూ ప్రశ్నించారు. నమ్మిన టీడీపీ కార్యకర్తలకు అవమానం జరుగుతోందని… కర్నూలు జిల్లాలో పరిస్థితులు దారితప్పాయన్నారు. అన్ని విషయాలు చంద్రబాబు దృష్టికి కర్నూలు జిల్లాలో ఏమి జరుగుతుందో చెప్పకపోతే పార్టీకి మోసం చేసినవాన్ని అవుతానని వివరించారు.