తణుకులో లేడీ అఘోరీ హల్ చల్ చేసింది. రాజేష్ నాథ్ అఘోర అంతు చూస్తా అంటూ తణుకులో లేడీ అఘోరీ హల్ చల్ చేసింది. తణుకు బ్యాంక్ కాలనీలో రాజేష్ నాథ్ ఇంటిముందు బైఠాయించింది లేడీ అఘోరీ. అఘోర ముసుగులో రాజేష్ నాథ్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న లేడీ అఘోరీ..రచ్చ రచ్చ చేసింది.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. లేడీ అఘోరీ ని అక్కడిని తీసుకెళ్లారు.
కాగా, తనుకు తాను అఘోర బాబాగా చెప్పుకుంటున్న తణుకుకు చెందిన రాజేష్ నాథ్ అనే వ్యక్తి.. ఇద్దరు అమ్మాయిలతో అసభ్యంగా చేసిన చాటింగ్ స్క్రీన్ షాట్స్ బయటకు లీక్ అయ్యాయి. ‘రూమ్ బుక్ చేశాను ముగ్గురం కలిసి కోరిక తీర్చుకుందాం’అని యువతులతో చేసిన చాట్ బయటకు వచ్చింది. దీంతో తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది. తనతో అఘోర బాబా రాజేష్ నాథ్ చేసిన చాట్‌ను సదరు యువతి బయటపెట్టింది. దీనికి సంబంధించిన వీడియా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే… దీనిపై లేడీ అఘోరీ నిరసనకు దిగింది.
తణుకులో లేడీ అఘోరీ హల్ చల్
రాజేష్ నాథ్ అఘోర అంతు చూస్తా
తణుకు బ్యాంక్ కాలనీలో రాజేష్ నాథ్ ఇంటిముందు బైఠాయించిన లేడీ అఘోరీ
అఘోర ముసుగులో రాజేష్ నాథ్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న లేడీ అఘోరీ https://t.co/kBkzh2rpKg pic.twitter.com/iQWFJ7DKw1
— BIG TV Breaking News (@bigtvtelugu) March 3, 2025