టీడీపీ వాళ్లకే పనులు చేయండి అని చంద్రబాబే చెప్పడం సిగ్గుచేటు అంటూ బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. లబ్దిదారులకు రాజకీయాలు, పార్టీలను అంటగడతారా..? కౌన్సిల్ లో బొత్స ఫైర్ అయ్యారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న చంద్రబాబు.. పథకాలపై చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదని విమర్శలు చేశారు బొత్స. ముఖ్యమంత్రి పదవిలో ఉండి చంద్రబాబు మాట్లాడిన మాటలకు సిగ్గుపడాలని ఆగ్రహించారు.
అర్హులైన లబ్దిదారులకు పథకాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. ప్రమాణం చేసి పదవులు తీసుకున్న వ్యక్తులు ఇలాంటి మాటలు మాట్లాడతారా..? కేవలం కార్యకర్తలకు ఇవ్వమనడానికి ఇదేమైనా వాళ్ళ సొంత ఆస్తా..? అంటూ నిలదీశారు. మా ప్రభుత్వంలో గత ఐదేళ్లలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ పథకాలు ఇచ్చామన్నారు బొత్స సత్యనారాయణ. లబ్దిదారులకు రాజకీయాలు, పార్టీలను అంటగడతారా..? అంటూ కౌన్సిల్ లో బొత్స ఫైర్ అయ్యారు.