శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం

-

leopard roaming in srisailam  :  శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం రేపింది. శ్రీశైలంలో చిరుత సంచారం మరోసారి వెలుగులోకి వచ్చింది. శ్రీశైలం పాతాళగంగా పాత మెట్ల మార్గంలో సంచారం చేస్తోంది. డివైడర్‌పై చాలా సేపు కూర్చొని.తర్వాత అటవీ ప్రాంతంలోకి వెళ్లింది చిరుత పులి. గతంలోనూ అదే ప్రాంతంలో సంచారం చేసిందట చిరుత.

leopard roaming in srisailam and wild animals fear in tirumala

స్థానికులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేశారు. ఇక గత బుధవారం అర్ధరాత్రి చిరుత సంచారం సీసీకెమెరాల్లో రికార్డయింది. అర్ధరాత్రి సమయంలో టోల్ గేట్ చెకింగ్ పాయింట్ పక్కన చిరుతపులి సంచించిన వీడియోలు రికార్డయ్యాయి. టోల్ గెట్ పక్కన పడుకుని ఉన్న కుక్కను వేటాడి చిరుతపులి నోటితో పట్టుకుని వెళ్లింది. ఈ దృశ్యాలు అక్కడి కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. తాజాగా ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news