తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపింది. తిరుమలలో ఉన్న అలిపిరి నడక మార్గంలో చిరుత సంచారం మరోసారి తెరపైకి వచ్చింది. అలిపిరి మార్గంలో ఉన్న నరసింహస్వామి ఆలయం దగ్గర చిరుత సంచారం స్పష్టంగా భక్తులు చూశారు. వారం రోజుల కిందట ఇదే ప్రాంతంలో చిరుత సంచరించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో టిటిడి అధికారులు అలాగే అటవీశాఖ అధికారులు అలర్ట్ అయ్యారు.
కానీ ఇవాళ మరోసారి ఉదయం నాలుగు గంటల సమయంలో చిరుత కలకలం రేపింది. దీంతో భక్తులందరూ ఆందోళనకు గురవుతున్నారు. ఈ తరుణంలోనే టీటీడీ అధికారులు అలాగే అటవీశాఖ అధికారులు అలర్ట్ అయిపోయారు. నడక దారిలో వెళ్లే తిరుమల శ్రీవారి భక్తులను గుంపులుగా మాత్రమే అనుమతిస్తున్నారు. అలాగే… వారికి కర్రలు కూడా అప్పగిస్తున్నారు. ఎలాంటి భయాందోళనకు గురికాకుండా… చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. కాగా గతంలో మూడు చిరుతలను టీటీడీ అధికారులు పట్టుకున్న సంగతి తెలిసిందే.