న్యూ ఇయర్ వేళ హైదరాబాద్ లో ఆంక్షలు.. ఇవి పాటించాల్సిందే

-

ఈ ఏడాది ముగిస్తోంది. కొత్త ఏడాదికి సమయం ఆసన్నమైంది. మరో పది రోజుల్లో న్యూ ఇయర్ పలకరించబోతుంది. ఈ నేపథ్యంలో న్యూ ఇయర్ వేడుకలకు భాగ్యనగరం రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే యువత తమ పార్టీలకు సంబంధించి పక్కా ప్లాన్లు రెడీ చేసుకున్నారు. మరోవైపు న్యూ ఇయర్ ఈవెంట్లు నిర్వహించేందుకు ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలు సిద్ధమయ్యాయి.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ సరఫరాను కట్టడి చేసేందుకు ఇప్పటికే తనిఖీలు ముమ్మరం చేశాయి. ఈ నెల 31 రాత్రి కొత్త సంవత్సర వేడుకలు నిర్వహించే హోటళ్లు, పబ్‌లు, నక్షత్రాల హోటళ్లు, క్లబ్బులు, ఈవెంట్‌ సంస్థలు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని నగర పోలీసు కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు.

మరి న్యూ ఇయర్ వేడుకల్లో పాటించాల్సిన నిబంధనలు ఏంటంటే..?

  • 3 స్టార్‌, ఆపై హోటళ్లు, క్లబ్బులు, బార్‌, రెస్టారెంట్లు/పబ్‌లు 31న అర్ధరాత్రి ఒంటిగంట వరకు మాత్రమే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలి.
  • న్యూ ఇయర్ ఈవెంట్ జరిపే హోటల్స్, క్లబ్స్, బార్, రెస్టారెంట్స్, పబ్లు 10 రోజులకు ముందే నగర పోలీసుల, సంబంధిత శాఖల అనుమతులు తీసుకోవాలి.
  • ఉత్సవాల ప్రదేశాల్లో, లోపల/బయటకు వెళ్లే మార్గాల్లో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.
  • సాంస్కృతిక కార్యక్రమాల పేరిట అసభ్య, అశ్లీల నృత్యాలు నిర్వహించకూడదు
  • సంగీతం, శబ్దం 45 డెసిబుల్స్‌ మించితే చర్యలు తప్పవు
  • బాణసంచా, పేలుడు పదార్థాలకు అనుమతి లేదు.
  • వేడుకల్లో నిషేధిత మాదకద్రవ్యాలను అనుమతించే నిర్వాహకులపై కఠిన చర్యలు
  • సురక్షితంగా ఇల్లు చేరేందుకు ‘డిజైన్డ్‌ డ్రైవర్‌ ఫర్‌ ఏ డే’ సహాయకులను ఉపయోగించుకోవాలి

Read more RELATED
Recommended to you

Exit mobile version