తిరుమల శ్రీవారి సన్నిధిలో చిరుత కలకలం రేపుతోంది. ఇప్పటికే చాలాసార్లు తిరుమలలో చిరుతలు సంచరించిన సంఘటనలు జరిగాయి. టిటిడి పాలక మండలి ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ… భక్తులు మెట్ల మార్గం నుంచి వెళ్తున్న సమయంలోనే… చిరుతలు తెరపైకి వస్తున్నాయి.

జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు… నెలలో కనీసం మూడుసార్లు చిరుతలు కనిపించిన సంఘటనలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో తాజాగా మరోసారి చిరుత కలకలం రేపింది. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో మరోసారి చిరుత కలకలం రేపింది. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ లేడీస్ హాస్టల్ పరిసరాలలో చిరుతను చూసి అధికారులకు సమాచారం ఇచ్చారు విద్యార్థులు. దీంతో టిటిడి అధికారులు అలర్ట్ అయ్యారు. విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో మరోసారి చిరుత కలకలం
లేడీస్ హాస్టల్ పరిసరాల్లో చిరుతను చూసి అధికారులకు సమాచారమిచ్చిన విద్యార్థులు
విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారుల హెచ్చరిక pic.twitter.com/pfkcfQdOrE
— BIG TV Breaking News (@bigtvtelugu) March 30, 2025