కామారెడ్డి జిల్లా తీవ్ర విషాదం నెలకొంది. ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ అగ్రహారం గ్రామంలో ఈ విషాదం జరిగింది. ప్రమాదవశాత్తు చెరువులో పడి తల్లీ, ఇద్దరు కుమారులు, కుమార్తె మృతి చెందారు. మృతి చెందినవారు మౌనిక(26), మైథిలి(10), వినయ్(7), అక్షర(9) గా గుర్తించారు పోలీసులు.

అటు ఈ సంఘటన లో మౌనిక మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. ఊరి చివరలో ఉన్న చెరువు దగ్గరికి బట్టలు ఉతకడానికి వెళ్లి ప్రమాదవశాత్తు పడి మృతి చెందారు. ఇక ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందిన సంఘనత లో ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.