తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం.. ఇవాళ 12 గంటలకే

-

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రేవంత్ రెడ్డి ఇవాళ గవర్నర్ తో సమావేశం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల సమయంలో రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలుస్తారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణ పై చర్చించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

revanth

నలుగురు కొత్త మంత్రులతో ఏప్రిల్ మూడవ తేదీన.. ప్రమాణ స్వీకారం కూడా ఉంటుందని అంటున్నారు. అయితే ఈ నలుగురు మంత్రులు ఎవరు అనే దానిపై చర్చ జరుగుతోంది. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, విజయశాంతి, వి6 వివేక్ , వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసరెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇంకా ఆశవాహులు ఎక్కువగానే ఉన్నారు. మరి ఇందులో ఎవరికి పదవి దక్కుతుందో… చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news