ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా తగ్గాయని వెల్లడించారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బెల్టు షాపుల తొలగింపు, పర్మిట్ రూమ్ ల రద్దుతో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తగ్గాయన్నారు. ధరల పెంపు వల్ల కూడా మద్యం వాడకం తగ్గింది అన్న సీఎం జగన్.. అక్రమ మద్యం తయారీ, విక్రయంపై SEB ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. అలాగే పన్ను చెల్లింపుదారులకు మరింత అవగాహన కల్పించాలని సీఎం జగన్ సూచించారు.
అలాగే పన్ను ఎగవేసే సంస్థలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పన్ను చెల్లింపు ప్రక్రియను మరింత సులభతరం చేయాలని ఆదేశించారు. అక్రమ మద్యం తయారీదారులకు జీవనోపాధి కల్పించాలన్న సీఎం జగన్.. ఏజెన్సీలో గంజాయి పండించే వారికి ఉపాధి కల్పించాలని, ఆదాయాన్నిచ్చే శాఖల పై సమీక్షలో తెలిపారు. అక్రమాలకు పాల్పడే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర ఆదాయం పెరిగేలా ప్రత్యామ్న్యాయ మార్గాలను అన్వేషించాలని సూచించారు.