లోకేష్ కి రాజకీయనేత లక్షణాలు లేవు : విజయసాయిరెడ్డి

-

వైసీపీ నాలుగున్నర ఏళ్ల పాలనలో చేపట్టిన సామాజిక సాధికారిక గురించి ప్రజలకు వివరించే కార్యక్రమమే ఈ యాత్ర అని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. 175 నియోజకవర్గాల్లో ఈ యాత్ర జరుగుతుందని వైసీపీ పెత్తందారుల పార్టీ కాదని ప్రజల పార్టీ అంటూ తెలిపారు. చంద్రబాబు నాయుడు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలకు చేసింది ఏం లేదని విమర్శించారు. చంద్రబాబు ప్రజలకు ద్రోహం చేశారు కాబట్టే జైల్లో ఉన్నాడు. ఆయనను ప్రజలు పట్టించుకోవడం లేదంటూ ఎంపీ విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు చరిత్ర ముగిసిందని విమర్శించారు.

సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయాలను చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక పోతున్నాయి. మరోవైపు రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏవి లోకేష్ కు లేవు అని మండిపడ్డారు. పురందేశ్వరి గతంలో కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నారు ఆ తర్వాత బిజెపి పార్టీలోకి వచ్చారు ఆమెకి సిద్ధాంతాలు నైతిక విలువలు లేవు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పురందేశ్వరి ఆరోపణలు అర్థరహితమైనవి.. నాపై, మిథున్ రెడ్డి పై పురందేశ్వరి అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. పురందేశ్వరి మందు తాగుతారో లేదో నాకు తెలియదు. కానీ నాకు మాత్రం మద్యం, నాన్ వెజ్ అలవాటు లేదని చెప్పారు విజయ సాయి రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version