వైసీపీకి 11 సీట్లే అనుకోవద్దు, సంబర పడవద్దు… 40 శాతం ఓట్లు ఉన్నాయి అంటూ వార్నింగ్ ఇచ్చారు అంబటి రాంబాబు. గుంటూరులో కరెంటు చార్జీల బాదుడిపై వైసీపీ పోరుబాట కొనసాగుతోంది. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ… విద్యుత్ చార్జీలతోపాటు, నువ్వు చేసే ప్రజా వ్యతిరేక, పరిపాలనపై వైసీపీ పోరాడుతూనే ఉంటుందన్నారు. వరి రైతుకు కనీసం 1740 గిట్టుబాటు ధర, ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. కానీ ఒక్క బస్తా కూడా గిట్టుబాటు ధరకు కొనలేదని ఆగ్రహించారు.
1300కు, 1400కు బేరాలు ఆడి మిల్లర్లు రైతులను దోచుకుంటున్నారు..అయినా ప్రభుత్వానికి పట్టడం లేదని ఫైర్ అయ్యారు. పెంచిన విద్యుత్ ఛార్జీలో తక్షణమే తగ్గించాలని వైసీపీ డిమాండ్ చేస్తుందన్నారు. వినియోగదారులకు, రైతులకు, ప్రజలకు ఎక్కడ నష్టం జరిగినా, వైసిపి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం తల వంచే విధంగా పోరాడుతామన్నారు. జరుగుతున్న ఉద్యమాన్ని ,పోరుబాటగా తీసుకువెళ్తాం …ప్రజలందరూ కలిసి రావాలని తెలిపారు. ప్రభుత్వం ఎప్పుడు ధరలు పెంచినా, వైసీపీ పోరాటం చేస్తుందని పేర్కొన్నారు.