లోకేష్ ఒక లోఫర్ – ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

కడప: యువగళం పాదయాత్రలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, భూపేష్ రెడ్డి చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు వైసిపి ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి. నేడు జమ్మలమడుగు వైసిపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లోకేష్ ఒక లోఫర్, భూపేష్ ఒక బూతద్దం అని విమర్శించారు. లోకేష్ విదేశాల్లో అమ్మాయిలతో ఆటలాడుకుంటాడని.. భూపేష్, ఎమ్మెల్సీ శివనాథ రెడ్డిలు పేకాటలో దొరుకుతారని.. వీళ్లా మా గురించి మాట్లాడేదని మండిపడ్డారు.

లోకేష్ నేను మూర్ఖున్ని అని పదే పదే మీటింగ్ లో చెప్పుకుంటాడని అది జాతీయ నాయకుడి కొడుకు లక్షణం అంటూ ఎద్దేవా చేశారు. తాను కమిషన్లు తీసుకున్నానని అంటున్నారని.. జమ్మలమడుగు నారపురస్వామి దేవాలయం దగ్గరకి రండి ప్రమాణం చేద్దాం అంటూ సవాల్ విసిరారు. దమ్ముంటే ఆది నారాయణ రెడ్డి బి.జె.పి తరుపున, భూపేష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేయాలని చాలెంజ్ చేశారు. లోకేష్.. ఇప్పుడే నీళ్లతో పచ్చగా పంటపొలాలతో నియోజక వర్గం ఉంది.. నీ అపద్దపు మాటలతో రక్తం పారనీయవద్దు అని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version