సీఎం జగన్‌ కాదు..ఇక రిచ్ మోహ‌న్‌ – నారా లోకేష్‌

-

సీఎం జగన్‌ పై ఫైర్‌ అయ్యారు నారా లోకేష్‌. పింఛ‌ను పీకేసిన 6 ల‌క్ష‌ల మందితో సెల్ఫీ దిగు రిచ్ మోహ‌న్‌! అంటూ చురకలు అంటించారు. పేద‌ల్ని దోచుకుని వేల కోట్లు దాచుకుని దేశంలోనే అత్యంత ధ‌నికుడైన సీఎం రిచ్ మోహ‌న్ రెడ్డి గారు..పేద‌ల‌తో ప్ర‌యాణం చేయ‌డం అంటే వారికి అన్యాయం చేయ‌డ‌మా? అని ఆగ్రహించారు.

పెత్తందారుల‌తో యుద్ధం అంటే రాష్ట్ర సంప‌ద దోచిపెట్టిన వారితో వాటాల కోసం చేసే యుద్ధ‌మా? ప్ర‌తీ ఇంటికి మేలు చేశామ‌ని, ఆ ఇంటివారితో నిజ‌మైన‌ సెల్ఫీ దిగుతాన‌ని గొప్ప‌గా చెప్పావు క‌దా రిచ్ మోహ‌న్‌ అంటూ ఫైర్‌ అయ్యారు. భోరున విల‌పిస్తున్న ఆ వితంతువుతో వ‌చ్చి సెల్ఫీ దిగు.

ఎన్టీఆర్ భ‌రోసా పింఛ‌నుని, వైఎస్సార్ పెన్ష‌న్ కానుక‌గా ప‌త్తికొండ నియోజ‌క‌వ‌ర్గం తుగ్గ‌లి మండ‌లం శ‌భాష్‌పురం గ్రామంలో త‌లారి యంక‌మ్మ అనే వితంతువుకి రెండేళ్ల క్రిత‌మే పింఛ‌ను తీసేశావు. పేరు మార్చావు అన్నారు. ఎన్నిక‌ల‌కి ముందు 3 వేలుకి పెంచుతామ‌న్న పింఛ‌ను నాలుగేళ్ల‌యినా ఇంకా 3 వేల‌కి చేరలేదు. ఈ లోగానే త‌లారి యంక‌మ్మలాగే రాష్ట్రంలో 6 ల‌క్ష‌ల మంది బ‌తుకుల‌కి భ‌రోసా అయిన పెన్ష‌న్ పీకేశావు. ఈ ఆరుల‌క్ష‌ల మందితో సెల్ఫీలు దిగు రిచ్ మోహ‌న్‌! అంటూ ట్వీట్‌ చేశారు లోకేష్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version