వివేకా హ్యత కేసులో సంచలన వీడియోను బయటపెట్టిన లోకేష్‌ !

-

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో కీలక ఆధారాలు సీబీఐ అధికారులు చేతికి వచ్చాయి. కడప ఎంపీ అవినాష్ రెడ్డి అలాగే ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి కీలక నిందితుడని సిబిఐ అధికారులు ప్రాథమిక విచారణకు వచ్చే సమాచారం అందుతోంది.

ఇలాంటి తరుణంలో నారా లోకేష్.. ఓ సంచలన వీడియోను షేర్‌ చేశాడు. మహేష్‌ బాబు హీరోగా నటించిన అతడు మూవీ సీన్‌ ను.. వివేకా హత్య కేసుకు సంబంధం పెడుతూ ఓ ఫన్నీ వీడియోను షేర్‌ చేశాడు నారా లోకేష్‌. అయితే.. కోటా శ్రీనివాస్‌ రావు స్థానంలో సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఉంచిన వీడియోను పోస్టు చేశాడు నారా లోకేష్‌.

“బాబాయ్ ని బ్రతిమాలుకుంటే ఎంపీ అవుతారు… బాబాయ్ ని లేపేస్తే హంతకులవుతారు … అబ్బాయిలు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు?” అంటూ ఆ వీడియోకు నారా లోకేష్‌ ట్యాగ్‌ లైన్‌ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version