తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అంతటా పాదయాత్ర చేపట్టి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే.. చంద్రబాబు పాదయాత్ర చేపట్టిన దశాబ్ద కాలానికి ఆయన తనయుడు, టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఇదే తరహాలో పాదయాత్ర చేపట్టనున్నారు.
నవంబరులో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టాలని, రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే వరకు పాదయాత్రను కొనసాగించాలని లోకేష్ నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రమంతా తిరిగే వరకు ఎలాంటి విరామం ఇవ్వకుండా మారథాన్ పాదయాత్ర చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
దీనిపై త్వరలోనే రోడ్ మ్యాప్ కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం అందుతోంది. అయితే ఆసక్తికరమై విషయం ఏంటంటే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా 2017 నవంబర్ నెలలో తన పాదయాత్రను ప్రారంభించారు. నవంబర్ 6 నుండి జనవరి 9, 2019 వరకు “ప్రజా సంకల్ప యాత్ర” పేరుతో పాదయాత్రలో పాల్గొన్నారు. అదే తరహాలో లోకేష్ చేయాలని అనుకుంటున్నారట.