చంద్రబాబు అధికారంలో లేరు అని అంటే.. ఆ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేశారని అర్ధం! చంద్రబాబు టాలెంట్ గురించి ఒకమాటలో చెప్పాలంటే ఇదే! తనకు తానుగా ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి గెలిచిన దాఖలాలు లేవు! ఈ సమయంలో 2019 బాబు జీవితంలో ఓ చేదు జ్ఞాపకం. ఇలాంటి జ్ఞాపకాలు ఇక తట్టుకోవడం తలచుకోవడం తనవల్ల కాదని బలంగా నమ్మిన బాబు… రకరకాల ఆప్షన్స్ వెతికి పెట్టుకున్నారు! అవేమిటి అన్నది ఇప్పుడు చూద్దాం!
సింగం సింగిల్ గా వస్తుంది.. అనే డైలాగ్ బాబు జీవితానికి సూట్ కాదు! సింగిల్ గా వస్తే ఏమవుతుందనేది 2019 ఎన్నికల ఫలితాలు కళ్లకు కట్టినట్లు చూపించాయి! ఒకప్పుడు తెరాస, కమ్యునిస్టులు, ఆఖరికి కాంగ్రెస్ తో కూడా జతకట్టిన చరిత్ర బాబు సొంతం! పైనున్న ఎన్ టీఆర్… తాను స్థాపించిన టీడీపీ కాంగ్రెస్ తో జతకడుతుందని కలలో కూడా ఊహించి ఉండరు. అది చూసిన ఆయనకు స్వర్గంలో ఉన్నా కూడ అది నరకంలా అనిపించే పరిస్థితి!!
ఆ సంగతులు అలా ఉంటే… 2024 లో చంద్రబాబు ఆరు నూరైనా నూరు ఆరైనా ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదు! ఎన్నికల్లో పోటీ చేయడం మాననైనా మానేస్తారేమో కానీ.. సోలో గా మాత్రం నో ఛాన్స్! ఆ సమయంలో బాబుకు లాట్ ఆఫ్ ఆప్షన్స్ పెట్టుకున్నారని అంటున్నారు విశ్లేషకులు! అందొస్తాడనుకున్న కొడుకు అసమర్ధుడైన వేల.. దత్తపుతౄడుని నమ్ముకున్నారు బాబు! ఆయన ఏమైనా బీజేపీతో కాస్త కలపగలిగితే… టీడీపీ – జనసేన – బీజేపీ.. సూపర్ కాంబినేషన్.. వెంటనే తానే సీఎం అని బాబు పగటి కలలు కంటున్నారంట! అందుకే అడగకపోయినా పార్లమెంటులో మద్దతు, అడగకపోయినా మోడీపై ఈగకూడా వాలనివ్వని ఫెర్ఫార్మెన్సు!
సపోజ్.. ఫర్ సపోజ్.. బీజేపీతో కలపడం దత్తపుత్రుడివల్ల కూడా కానిపక్షంలో.. కాంగ్రెస్ + కమ్యునిస్టులతో అయినా రంగంలోకి దిగాలని బాబు ప్రయత్నాలు చేస్తున్నారంట! అయితే మోడీ లేదంటే సోనియా… ఈ రేంజ్ లో ఈ సీనియర్ పొలిటీషియన్ పిలిటికల్ స్ట్రాటజీలు వేస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు! అలాకానిపక్షంలో… అటు బీజేపీ కావాలి, ఇటు కమ్యునిస్టులు కావాలి.. కాంగ్రెస్ తోనూ బాగుండాలి అని బాబు చేస్తున్న ప్రయత్నాలు అందుకు గాక మరెందుకనేది విశ్లేషకుల ప్రశ్న!
ఆఖరికి ఆత్మగౌరవ నినాధంతో పుట్టిన టీడీపీకి బాబు ఈ పరిస్థితి తీసుకొచ్చారన్నమాట!!
-CH Raja