ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మద్యం వినియోగ దారులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మద్యం ఉన్న పన్ను రేట్ల ను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మద్యం పై విధించి పన్ను రేట్లలో మార్పులు చేసి మద్యం ధర ను తగ్గించాలని జగన్ సర్కార్ భావిస్తుంది. వ్యాట్, స్పెషల్ మార్జిన్ తో పాటు అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ ని రాష్ట్ర ప్రభుత్వం క్రమబద్ధీకరించింది.
అందు లో భాగం గా ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ పై 5 నుంచి 12 శాతం మేర పన్నులను తగ్గించే అవకాశం ఉంది. అలాగే ఇతర అన్ని మద్యం బ్రాండ్ పై 20 శాతం పన్ను తగ్గించే అవకాశం ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇక నుంచి అన్ని బ్రాండ్ల మద్యం అమ్మాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే వారం నుంచే ఇది అమలు చేయాలని సూచించింది. రాష్ట్రంలో అక్రమ మద్యాన్ని, నాటు సారా ను అరి కట్టడానికి కే ఈ నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.