SLBC ప్రాజెక్టు పై చిల్లర రాజకీయాలు వద్దు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

-

SLBC ప్రాజెక్ట్ పై చిల్లర రాజకీయాలు వద్దు అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తాజాగా ఆయన ప్రమాదం జరిగిన పాయింట్  వద్ద మీడియాతో మాట్లాడారు. లోపల ఇరుక్కున్న వారిని బయటికి తీసేందుకు చాలా ప్రయత్నం చేస్తున్నాం. మేము ఇంత చేస్తుంటే కొంత మంది చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. దేశంలోనే గొప్ప ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే నల్గొండ జిల్లాల్లో లక్షల ఎకరాలకు నీరు అందుతుంది. దేశంలోనే అత్యంత నిపుణులైన 10 మంది ఏజెన్సీలు సహకారం అందిస్తున్నాయని తెలిపారు. 

కాళేశ్వరం బ్యారేజీ కూలిపోవడం కట్టిన మూడేళ్ల తరువాత దాని గురించి మాట్లాడలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన సమయంలో 7 గురు చనిపోయినా మేము మాట్లాడలేదు. SLBC తెలంగాణ రాష్ట్రానికి అత్యంత గొప్ప ప్రాజెక్ట్ అన్నారు. SLBC రెస్క్యూ విషయంలో ప్రభుత్వ చిత్తశుద్దిని ప్రజలు గమనిస్తున్నారు. ప్రకతి వైఫరిత్యం వల్ల జరిగిన ప్రమాదాలు దురదృష్టకరం అన్నారు. ప్రస్తుతం SLBC ప్రమాద స్థలంలో నీరు లీకు అవుతుంది. SLBC లక్షల మంది ప్రజలకు అద్భుతమైన ఇరిగేషన్ ప్రాజెక్టు అన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news