మాడుగుల ఎమ్మెల్యే అభ్యర్థి మార్పు దిశగా టీడీపీ..అతనికి ఛాన్స్‌ !

-

 

విశాఖలోని మాడుగుల ఎమ్మెల్యే అభ్యర్థి మార్పు దిశగా టీడీపీ ఆలోచన చేస్తోందని సమాచారం అందుతోంది. మాడుగుల ఎమ్మెల్యే అభ్యర్థి గా మళ్లీ మాజీ మంత్రి బండారు సత్యన్నారాయణ మూర్తి పేరు ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇక ఇవాళ, రేపు నూతన అభ్యర్థి ఎంపికపై ప్రకటన వెలువడే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

Madugula MLA candidate is TDP towards change

నిన్న అర్ధరాత్రి మాజీ మంత్రి బండారు సత్యన్నారాయణ మూర్తి ఇంటికి వెళ్లి అనకాపల్లి ఎంపీ అభ్యర్థి CM రమేష్ మంతనాలు చేశారు. బండారు పోటీ చేస్తే సహకరిస్తానని హామీ ఇచ్చారట మాజీ ఎమ్మెల్యే రామానాయుడు. అయితే.. మాడుగులలో పోటీకి కొన్ని షరతులు పెట్టారట బండారు సత్యన్నారాయణ మూర్తి. పెందుర్తి ఇన్చార్జిగా బాధ్యతలు తన కుమార్డికి ఇవ్వాలని కోరారట మాజీ మంత్రి బండారు సత్యన్నారాయణ మూర్తి. దీనికి అధి ష్టానం కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news