తిరుమల సన్నిధిలో భారీ అగ్నిప్రమాదం

-

తిరుమల సన్నిధిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం సమీపంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆలయ సమీపంలోని ఓ ఫోటో ఫ్రేమ్ షాపులో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగింది. ఈ క్రమంలో ఆలయం ముందున్న చలువ పందిళ్లకు మంటలు అంటుకున్నాయి.

Major fire breaks out near Tirupati Govindarajaswamy Temple
Major fire breaks out near Tirupati Govindarajaswamy Temple

మంటలు వేగంగా వ్యాపించడంతో ఆరు దుకాణాలు, పది ద్విచక్ర వాహనాలు దగ్ధమైనట్లు సమాచారం అందుతోంది. ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పివేసింది అగ్నిమాపక సిబ్బంది. అటు ఆలయ రథం సురక్షితంగా తరలించబడినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news