పుంగనూరు ఘటన కేంద్ర బిందువు, వ్యూహకర్త చంద్రబాబేనని ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ మల్లాది విష్ణు ఆరోపించారు. చంద్రబాబు హింసను ప్రేరేపించారని.. చంద్రబాబు పై చర్యలు తీసుకోవాలని మేం డిమాండ్ చేస్తున్నామని ఫైర్ అయ్యారు. పుంగనూరు వంటి ఘటనల పై ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని..వ్యూహం ప్రకారమే చంద్రబాబు విధ్వంసానికి పాల్పడ్డారని ఆగ్రహించారు.
తన అసమర్థత, చేతకానితనం చంద్రబాబు మాటల్లో వ్యక్తం అయ్యిందని.. ఈ దాడిని ప్రజాస్వామ్య వాదులు అందరూ ఖండించాలని కోరారు ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ మల్లాది విష్ణు. 50 మంది మా కార్యకర్తలు, పోలీసుల పై కూడా దాడి చేశారని.. ఇటువంటి ఘటనలను ప్రతిపక్షాలు ఎందుకు ఖండించటం లేదు?? అని ఫైర్ అయ్యారు ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ మల్లాది విష్ణు. ప్రజా సమస్యల పై మాట్లాడే ధైర్యం లేక ప్రతిపక్షాలు హింసను ప్రేరేపిస్తున్నాయని చురకలు అంటించారు ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ మల్లాది విష్ణు.