కరోనా భయం కొందరిని బాగా ఇబ్బంది పెడుతుంది. దేశంలో కేసులు తగ్గినా సరే, కరోనా నుంచి వేగంగా కోలుకుంటున్నా సరే కొందరిని కరోనా భయం వెంటాడుతుంది. కరోనా వస్తే ఏదో అయిపోతుంది అనే భయంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎవరికి వారిగా ఇంట్లో వైద్యం చేసుకుంటున్న రోజుల్లో కరోనాకు కంగారు పడుతున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఆశ్రం కోవిడ్ ఆసుపత్రిలో బాత్ రూమ్ లో ఉరేసుకుని కరోనా పేషెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు మొగల్తూరు మండలం కొత్తపాలెంకు చెందిన వ్యక్తిగా అధికారులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి ఏలూరు రూరల్ పోలీసులు విచారణ చేపట్టారు. అతని ఆత్మహత్యకు కరోనానే కారణమా లేక మరేదైనా ఉందా అనే దాని మీద ఆరా తీస్తున్నారు.