BREAKING : తిరుపతి జూలో వ్యక్తిని చంపిన సింహం

-

తిరుపతి జూ పార్క్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. లయన్‌ ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన సందర్శకుడిపై సింహం దాడి చేసి చంపేసింది. ఈ దాడిలో అతని తల భాగాన్ని సింహం పూర్తిగా తినేసిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దాడి చేసిన సింహాన్ని జంతు ప్రదర్శనశాల అధికారులు బోనులో బంధించారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా? లేక కావాలనే ఆ వ్యక్తి లయన్‌ ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లాడా? అనేది విచారణలో తేలాల్సి ఉంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సాధారణంగా సింహం ఉన్న ప్రాంతంలో దాని వద్దకు ఎవరూ వెళ్లకుండా ఎవరైనా సెక్యూరిటీ లేదా సూచికలు ఉంటాయి. మరి ఈ జూ పార్క్‌లో సూచికలు ఉన్నా అతడు ఎన్‌క్లోజర్‌లోకి ఎందుకు వెళ్లాడు అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ ఘటన విషయాన్ని తెలుసుకున్న అటవీ, పోలీసు శాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి ఈ ఘటన ఎలా జరిగిందనే దానిపై ఆరా తీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version