ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మరో 9 రైల్వేస్టేషన్లో పలు రైళ్లు ఆగనున్నాయి. గత కొంతకాలంగా ప్రయాణికుల నుంచి రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, ప్రాంతాల నుంచి వస్తున్న డిమాండ్లను పరిగణలోకి తీసుకున్న రైల్వేశాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ఐదు ఉమ్మడి జిల్లాలతో పాటు తెలంగాణలోని డోర్నకల్ రైల్వే స్టేషన్ లో పలు రైళ్లను ఆపాలని నిర్ణయించారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్ల, సత్తెనపల్లి, నడికుడి, ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పీలేరు, కుప్పం, ఉమ్మడి విజయనగరం జిల్లాలోని బొబ్బిలి, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని దువ్వాడ రైల్వే స్టేషన్లలో రైళ్లు ఆగేలా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. ఇక దీనిపై ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.