ఢిల్లీ కాలుష్యం వరల్డ్ కప్ మ్యాచ్లను ప్రభావితం చేస్తోంది. ఈనెల 6న నగరంలో శ్రీలంక-బంగ్లాదేశ్ వరల్డ్ కప్ మ్యాచ్ జరగనుంది. అయితే కాలుష్యం మరి ఎక్కువగా ఉండటంతో బంగ్లా తమ ప్రాక్టీస్ ను రద్దు చేసుకుంది. ఆ టీం డైరెక్టర్ ఖలీద్ మహ్మద్ ఈ మేరకు తెలిపారు.
జట్టులో కొంతమందికి దగ్గు కూడా వస్తోందని, రిస్క్ ఎందుకని ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఈ రెండు రోజుల్లో ప్రాక్టీస్ కు వీలు చిక్కితే చేస్తామని పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా.. ఢిల్లీలో భారీ భూకంపం సంభవించింది. సుమారు 20 సెకన్ల పాటు కపించడంతో భయంతో జనాలు ఇళ్ళనుంచి పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 6.4గా నమోదైనట్లు తెలుస్తోంది. నేపాల్ లో భూమికి 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు తెలిపారు. అటు యూపీ, బీహార్ లలోను ప్రకంపనలు వచ్చినట్లు సమాచారం.