ఏపీ సీఎంవోలో కీలక మార్పులు..వీరికే కీలక బాధ్యతలు

-

ఏపీ సీఎంవోలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. సీఎమ్ఓ అధికారులకు పని విభజన చేస్తూ ఆదేశాలు జారీ జారీ చేసింది సర్కార్. సీఎమ్ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య కు జీఏడీ, విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన, ఆహార, పౌర సరఫరాలు, మార్కెటింగ్, స్త్రీ, శిశు సంక్షేమ, కేంద్రంతో సంప్రదింపులు కేటాయింపులు చేసింది ప్రభుత్వం.

 

ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయ రెడ్డికి ఆర్ధిక, హోమ్, సాగునీరు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, మైనింగ్, ఎనర్జీ, పర్యావరణ శాఖల కేటాయింపులు చేశారు. ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ముత్యాల రాజుకు రెవెన్యూ, న్యాయ, శాసనసభా వ్యవహారాలు, ప్రజా రవాణా, రోడ్డు, భవనాలు, కార్మిక, పర్యాటకం, స్కిల్ డెవలప్మెంట్ శాఖల కేటాయింపులు చేశారు. ముఖ్యమంత్రి జాయింట్ సెక్రటరీ నారాయణ భరత్ గుప్తాకు హౌసింగ్, పంచాయతీ రాజ్, గ్రామ, వార్డు సచివాలయాలు, ఐటీ, సీఎమ్ హామీలు, సంక్షేమ శాఖలు కేటాయింపులు చేశారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version