Fact Check : ఏపీ బ్రాండ్ అంబాసిడర్ గా మీనాక్షి చౌదరి.. వాస్తవం ఇదే..!

-

ఆంధ్రప్రదేశ్ ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్‌గా హీరోయిన్ మీనాక్షి చౌదరిని నియమించారని సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం పూర్తిగా ఫేక్ అని ఫ్యాక్ట్ చెక్ విభాగం ఖండించింది.  ప్రభుత్వం పేరుతో ఉద్దేశపూర్వకంగా ఇటువంటి తప్పుడు పోస్టులు పెడుతున్న వారిపై, ఫేక్ ప్రచారం చేస్తున్న వారిపై చట్ట ప్రకారమైన చర్యలు ఉంటాయని వెల్లడించింది.

త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ఉమెన్ ఎంపవ‌ర్‌మెంట్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా హీరోయిన్ మీనాక్షి చౌదరి బాధ్యతలు తీసుకోనుందని..  ఏపీ మహిళల కోసం పని చేయనున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు టాలీవుడ్ టూ కోలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ బిజీ హీరోయిన్ అయ్యింది.. తాజాగా మీనాక్షి చౌదరి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై నిర్మాత దిల్ రాజు, వెంకీ కాంబోలో వచ్చిన సంక్రాంతి వస్తున్నాం సినిమాతో మంచి విజయాన్ని దక్కించుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news