మైక్, మీటింగ్ ఫెయిల్ అంటూ అంబటి ట్వీట్.. నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్..!

-

పల్నాడు  జిల్లా బొప్పూడిలో జరిగిన ‘ప్రజాగళం’ సభను ఉద్దేశించి ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందిస్తూ.. ‘మైక్ ఫెయిల్, మీటింగ్ ఫెయిల్ టోటల్ గా ముగ్గురూ ఫెయిల్’ అని ట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్కు జనసేన నాయకుడు నాగబాబు ట్విట్టర్ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘మైకు ఫెయిల్, మీటింగు ఫెయిల్ అని మొరిగే మూర్ఖులంతా విన్నార నిన్న గౌరవ ప్రధాని మోడీ గారు మీకు ‘భ్రష్టాచార్’ అనే బిరుదు నిచ్చారు.


భ్రష్టాచార్ అంటే ‘అవినీతి’.. అవినీతి అంటే Corruption… అవినీతి అనే కోటకి మకుటం లేని మహారాజు మీ నాయకుడు. ఆ అవినీతి కిరీటాన్ని మాక్కావాలి మాక్కావాలి మేమేం తక్కువ అని పోటీ పడుతున్న మీరు కూడా, మా సభలను విమర్శిస్తుంటే ఎలా నవ్వాలో తెలీడం లేదు, మీ సిద్ధం సభల గ్రీన్ మ్యాట్ గ్రాఫిక్స్లు గాల్లో దీపాల్లా తేలిపోతున్నాయ్. ముందు మీరు ఆ VFX ఎడిటర్ని మార్చితే తప్ప లక్షల్లో జనాలొచ్చారని ప్రజల్ని ఏమార్చలేరు. ఫస్ట్ ఆ పన్లో ఉండండయ్యా భరితెగించిన భ్రష్టాచార్స్.’ అంటూ కౌంటర్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version