తల్లి లాంటి తన వృత్తిని మంత్రి అంబటి అవమానించారు : బాలకృష్ణ

-

ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు తనకు మీసం చూపి తొడగొట్టారని టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పేర్కొన్నారు. తల్లి లాంటి తన వృత్తిని మంత్రి అంబటి అవ మానిస్తే తాను రియాక్ట్ కావాల్సి వచ్చిందని వివరించారు బాలయ్య. ఏపీ అసెంబ్లీ నుండి సస్పెన్షన్ కు గురైన తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా అసెంబ్లీ వేదికగా తన వృత్తిని మంత్రి అంబటి రాంబాబు అవమానించారన్నారు.దీనికి తాను కౌంటర్ గా మంత్రి అంబటి రాంబాబుకు మీసం మేలేస్తూ తొడ కొట్టానని బాలకృష్ణ వివరించారు.

వైసీపీ ఎమ్మెల్యేలు తన వృత్తిని, సినీ కళాకారులను అవమానించారని బాలకృష్ణ విమర్శించారు.తెలుగు సినీ పరిశ్రమను అధికార పార్టీ నేతలు కించపర్చారని ఆయన ఆరోపించారు. తానే కాదు తన స్థానంలో ఎవరైనా ఈ విషయమై రియాక్ట్ అవుతారన్నారు. తన వృత్తి తనకు తల్లిలాంటిందన్నారు. అలాంటి తన వృత్తిని అవమానిస్తే తాను ఊరుకుంటానా అని బాలకృష్ణ ప్రశ్నించారు. సినిమాల్లో చూపించుకో అని మంత్రి అంబటి రాంబాబు అన్నారన్నారు. దీనికి తాను రా చూసుకుందామని చెప్పానని బాలకృష్ణ వివరించారు. తాను ఎవరికి భయపడనన్నారు. కేసులకు కూడ తాను భయపడబోనని బాలకృష్ణ తేల్చి చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version