తన PA ను తొలగించడంపై అనిత క్లారిటీ…అవసరమైతే పిల్లల్ని కూడా !

-

తన PA ను తొలగించడంపై మంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. నా ప్రయివేట్ PA పై ఆరోపణలు వచ్చాయని… అందుకే నా అంతటా నేనే తొలగించానని వెల్లడించారు. చాలా సార్లు అలెర్ట్ చేశాను, పద్ధతి మార్చుకోలేదు…టీడీపీ కి, ప్రభుత్వనికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారంటే నా పిల్లలను కూడా పక్కన పెడతానని బాంబ్‌ పేల్చారు.

Minister Anita made sensational comments on the removal of her PA

 

గత నెల రోజులుగా ఏదో ఒక వార్తల్లో విశాఖ సెంట్రల్ జైల్ నిలుస్తుందని.. గంజాయి సరఫరా జరుగుతున్నట్టు ఆరోపణలు వచ్చాయని తెలిపారు. విచారణ చేపట్టి కొంతమంది ని సస్పెండ్ చేయడం జరిగిందన్నారు. అధికారులు పై కూడా చర్యలు తీసుకున్నామని… మేము అధికారం లోకి వచ్చాక ప్రతిదీ గమనిస్తున్నామని వివరించారు. కాగా వంగలపూడి అనిత పీఏపై వేటు పడింది. అక్రమ వసూళ్లు,సెటిల్మెంట్లు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత పీఏ జగదీష్ ను తొలగించారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news