సంధ్య థియేటర్ల తొక్కిసలాట ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటికి ఆదివారం ఉదయం చిక్కడపల్లి ఎస్సై వెళ్లారు. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మృతురాలు రేవతి కుమారుడిని చూసేందుకు వెళ్లొద్దని అల్లు అర్జున్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం.
చిక్కడ పల్లి ఎస్సై వెళ్లిన సమయంలో అల్లు అర్జున్ నిద్రలేగపోవడంతో ఆయన మేనేజర్ మూర్తికి పోలీసులు నోటీసులు ఇచ్చి వెనుదిరిగినట్లు తెలుస్తోంది.ఇదిలాఉండగా, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు నేడు అల్లు అర్జున్ వెళ్లి సంతకం చేసి రావాల్సి ఉంది. ఇటీవల ఆయనకు రెగ్యులర్ బెయిల్ లభించడంతో కేసు పూర్తయ్యేవరకు ఇలా స్టేషన్‌కు వెళ్లి రిపోర్టు చేయాల్సి ఉంటుందని సమాచారం.
అల్లు అర్జున్ ఇంటికి చిక్కడపల్లి ఎస్సై..
👉కిమ్స్ హాస్పిటల్‌కి అల్లు అర్జున్ వెళ్లొద్దు అంటూ నోటీసులు ఇచ్చిన పోలీసులు
👉అల్లు అర్జున్ నిద్రలేగపోవడంతో ఆయన మేనేజర్ మూర్తికి నోటీసులు ఇచ్చిన పోలీసులు
For More Updates Download The App Now-https://t.co/iPdcphBI9M pic.twitter.com/P7PPyW0wuY— ChotaNews App (@ChotaNewsApp) January 5, 2025