సూర్యలంక బీచ్ అభివృద్ధికి 100 కోట్లు : మంత్రి కందుల దుర్గేష్

-

కొత్త టూరిజం పాలసీ ద్వారా పర్యాటక రంగంలో అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టనున్నామన్న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్.. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదన్నారు. రాబోయే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో నెంబర్ 1 గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలోని 974 కి.మీల సముద్ర తీర ప్రాంతంలో 9 బీచ్ లను ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని వెల్లడించిన మంత్రి.. రుషికొండ బీచ్ కు బ్లూ ఫాగ్ బీచ్ గా గుర్తింపు. రాగ. మరో 9 బీచ్ లు బ్లూఫాగ్ బీచ్ లుగా గుర్తింపు పొందేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో బీచ్ లు బ్లూఫాగ్ జాబితాలో చోటు సంపాదిస్తే పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. కాకినాడ సమీపంలోని హోప్ ఐలాండ్ ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నం. రూ.100 కోట్లతో సూర్యలంక బీచ్ అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇక నిరుద్యోగ యువత, ఫిషర్ మెన్ లు ముందుకు వస్తే వారికి సరైన రాయితీలు ఇచ్చి తద్వారా పర్యాటక అభివృద్ధి చేస్తాం అని మంత్రి దుర్గేష్ వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version