ఏపీలో అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..‘ఆపదలు వచ్చినప్పుడు ఒక నాయకుడు ఎలా ఉండాలో చంద్రబాబు నిరూపించారు.భారతదేశంలో సగం తెలుగువారు ఉండడానికి ముఖ్య కారకులు చంద్రబాబు.నాలెడ్జ్ ఎకానమీని అభివృద్ధి చేసి, దాని ఆవశ్యకతను చంద్రబాబు దేశమంతటికీ వివరించారు.
విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టినందుకు ఆయనకు చేతులెత్తి మొక్కుతున్నా. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై ఉక్కుపాదం మోపి సీఎం,హోం మంత్రి తీసుకున్న చర్యలు అభినందనీయం’ ఇకపై సోషల్ మీడియాలో ఎవరూ అనుచిత వ్యాఖ్యలు చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేశారు.