వంద రోజుల్లో 1.20 లక్షల ఇళ్ళు మా టార్గెట్..!

-

గృహనిర్మాణ శాఖపై ఇవాళ రివ్యూ చేసాం అని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. మైలవరంలో ఇళ్ళస్ధలాల అంశంలో ఇబ్బందికర పరిస్ధితులు ఉన్నాయి గత ప్రభుత్వంలో నిర్ణయించిన స్ధలాలు నివాసయోగ్యంగా లేవు.. కొన్నిచోట్ల వరదలు వచ్చే పరిస్ధితి ఉంది. ఇప్పుడు గృహ నిర్మాణంలో మట్టికోసం కొత్త విధానం ఆలోచించాం. ఫ్లై యాష్ ను వాడే విధంగా ఆలోచించాం. 2014-2019 గృహ నిర్మాణాల పై కొన్ని ఆందోళనకర పరిస్ధితులు ఉన్నాయి. అయితే 2014-19 నాటి గృహాలకు కూడా డబ్బు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు.

సీఎం చంద్రబాబు ఆదేశాలతో క్వాలిటీ చెక్ కూడా పూర్తిగా చేస్తున్నాం. లబ్ధిదారులను నష్టపరచిన వారిపై కచ్చితంగా చర్యలు ఉంటాయి. 500 ఇళ్ళు లోబడి నిర్మాణం చేసే వారని గుర్తించి వారికి నగదు చెల్లించే ఏర్పాటు చేస్తున్నాం. లబ్ధిదారులు రుణం పొంది కూడా నిర్మాణం చేయకపోతే.. భవిష్యత్తులో ఇబ్బందిపడతారు. స్ధానిక అధికారులు, ఎంఎల్ఏ లు లబ్ధిదారుల సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలి. కేంద్రం ఇళ్ళ నిర్మాణానికి 1.5 లక్షలు మాత్రమే ఇస్తుందని మాకు తెలిసింది. గృహ నిర్మాణం అత్యంత ముఖ్యమైన అంశంగా సీఎం చంద్రబాబు తెలిపారు. వంద రోజుల్లో 1.20 లక్షల ఇళ్ళు… రాబోయే రోజుల్లో 7 లక్షల ఇళ్ళు… మా టార్గెట్ అని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version