రెడ్ బుక్ పై మంత్రి లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చట్టాలని ఉల్లంఘించి,టిడిపి కార్యకర్తలను ,ప్రజలను ఇబ్బంది పెట్టారు….వాళ్ళని మాత్రం వదిలిపెట్టనని హెచ్చరించారు. జోగి రమేష్ కుమారుడు, ఏం చేశారు? ప్రజలు తెలుసుకోవాలన్నారు. అగ్రిగోల్డ్ భూముల పత్రాల కు , ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి, ఆ భూములను అమ్మేశారు… అలాంటి వాళ్ళపై చర్యలు తీసుకోకూడదా? అంటూ ప్రశ్నించారు.
భవిష్యత్ లో ఇసుక పాలసి పై కూడా యాక్షన్ తీసుకుంటామని… లిక్కర్ స్కాంపై కూడా చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. అడ్డగోలుగా ప్రజలు భూములు దోచేస్తూ ఉంటే, మేమేం పట్టించుకోకూడదా..నేను పాదయాత్ర చేసే సమయం లో రెడ్ బుక్ పట్టుకుని, ప్రతి ఊర్లో తిరిగి మాట్లాడానన్నారు. చట్టాలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటానని, అందుకే ప్రజలు మాకు అద్భుతమైన విజయాన్ని ఇచ్చారని తెలిపారు. అంబేద్కర్ పేరు కంటే జగన్ పేరు పెద్దదిగా ఉంది… బాధపడిన దళిత యువకులు జగన్ పేరును పీకేశారన్నారు.