తలుపులు తెరిస్తే…వైసీపీ ఎమ్మెల్యేలందరూ టీడీపీలోకే – మంత్రి మండిపల్లి

-

తిరుపతిలో పర్యటించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. టిడిపి తలుపులు తెరిస్తే వైసిపి ఎమ్మెల్యేలందరు టిడిపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని… త్వరలోనే వైసిపి ఖాళీ కావడం ఖాయం అంటూ బాంబ్‌ పేల్చారు. వైసిపిలో కొనసాగితే ప్రజా వ్యతిరేకత తప్పదని వైసిపి ఎమ్మెల్యేలు నిర్ణయానికివచ్చారని… మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపిలు, వైసిపి ముఖ్య నేతలు టిడిపిలో చేరబోతున్నారని వెల్లడించారు.

ఇప్పటికేచాలామంది వైసిపి ఎమ్మెల్యేలు చంద్రబాబు, నారా లోకేష్ లతో టచ్ లో ఉన్నారని… ఎన్డీయేతోనే ప్రజారంజకపాలన సాధ్యమని జగన్ కు అర్థమైందన్నారు. విజయసాయిరెడ్డి పగటి కలలు కంటున్నారని… జమిలీ ఎన్నికలకు ఎన్డీయే కూటమి భయపడటం లేదని వెల్లడించారు. ఒకవేళ ఎన్నికలు త్వరగా జరిగినా వైసిపి నుంచి పోటీ చేసే వారే ఉండరని చురకలు అంటించారు. జగన్ బి.ఫాంలు ఇస్తామని బతిమాలినా ఎవరూ తీసుకోరని ఎద్దేవా చేశారు. 365 రోజులు ప్రజల మధ్యన ఉండే వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ కొనియాడారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version