మంగళగిరిలో సాయిప్రియ హ్యాండ్లూమ్స్ షోరూమ్ ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్

-

మంగళగిరిలో సాయిప్రియ హ్యాండ్లూమ్స్ షోరూమ్ ప్రారంభించారు మంత్రి నారా లోకేశ్. చేనేత చీరను కొనుగోలు చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు మంత్రి లోకేశ్. పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య ఆధ్వర్యంలో మంగళగిరి తెనాలి రోడ్డు, బాప్టిస్ట్ చర్చి వద్ద జొన్నాదుల శ్రీనివాసరావు, జొన్నాదుల సాయికుమార్ నూతనంగా ఏర్పాటు చేశారు సాయిప్రియ హ్యాండ్లూమ్స్ షోరూమ్.

Minister Nara Lokesh inaugurated Sai Priya Handlooms showroom in Mangalagiri

ఇక అటు సోమవారం ఉదయం మంగళగిరిలోని డాన్ బాస్కో స్కూల్ వద్ద లబ్దిదారులకు మంత్రి నారాలోకేశ్ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 624 మంది లబ్ధిదారులకు శాశ్వత ఇళ్ల పట్టాలను మంత్రి అందజేశారు. గతంలో ఇళ్ల పట్టాలు రాని లబ్దిదారులకు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంలో శాశ్వత నివాసాల కోసం అందజేసినట్లు మంత్రి నారాలోకేశ్ వెల్లడించారు. కాగా, శాశ్వత ఇళ్ల పట్టాలు అందుకున్న లబ్దిదారులకు కూటమి ప్రభుత్వాన్ని అభినందించారు.

Read more RELATED
Recommended to you

Latest news