భద్రాచలంలో శ్రీరామ పట్టాభిషేకానికి సంబంధించిన క్రతువు మొదలైంది.దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను భద్రాద్రి ఆలయ అర్చకులు పూర్తి చేశారు. అనంతరం పట్టాభిషేక వేదిక వద్దకు సీతా లక్ష్మణ సహిత శ్రీ రామచంద్రమూర్తి వారిని తీసుకుని వచ్చారు.
పురోహితుల వేద మంత్రాలు, భక్త జనం సాక్షిగా కనులపండువగా పట్టాభిషేకాన్ని నిర్వహించనున్నారు. నిన్న శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల కల్యాణం కన్నుల పండుగా జరిగింది. నిన్న సీఎం రేవంత్ దంపతులు స్వామి వారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించగా.. నేడు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పట్టాభిషేక కార్యక్రమానికి హాజరై పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.