పెన్నా నది వంతెన బాధితులకు శుభవార్త చెప్పారు మంత్రి నారాయణ. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని భగత్ సింగ్ నగర్ లో పేదలకు ఇంటి స్థలాల పత్రాలను అందజేశారు మంత్రి నారాయణ. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ…. పెన్నా నది పై నిర్మిస్తున్న రెండో వంతెన వల్ల ఇళ్లను కోల్పోయిన వారికి స్థలాలను అందించామని తెలిపారు.

ఇంటి నిర్మాణ కోసం ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు మంత్రి నారాయణ. శివారు కాలనీలలో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని వెల్లడించారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను దశలవారీగా ప్రభుత్వం నెరవేరుస్తోందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని తెలియజేశారు మంత్రి నారాయణ.