తుంగభద్ర డ్యాం గేటు ప్రమాదంపై మంత్రి నిమ్మల సంచలన ప్రకటన

-

తుంగభద్ర డ్యాం గేటు ప్రమాదంపై ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సంచలన ప్రకటన చేశారు. తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోయిన సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారని… తుంగభద్ర డ్యాం సంఘటన ప్రదేశానికి చంద్రబాబు ఆదేశాలతో సెంట్రల్ డిజైన్ కమిషనర్ తో పాటు ఇంజనీరింగ్ డిజైన్స్ బృందాన్ని కూడా ఏర్పాటు చేసి పంపించడం జరిగిందన్నారు. యుద్ధ ప్రాతిపదికన డ్యాం గేటును అమర్చే మొదలుపెడతామని తెలిపారు.

Andhra Pradesh State Water Resources Minister Nimmala Ramanaidu has made a sensational statement about the Tungabhadra Dam gate accident

డ్యాం గేటు కొట్టుకుపోయినందున ప్రజలను అప్రమత్తం చేసేలా జిల్లా కలెక్టర్కు ఆదేశాలు ఇచ్చామని… కౌతాలం ,కోసిగి మంత్రాలయం, నందవరం మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల అధికారులను అప్రమత్తం గా ఉండాలని హెచ్చరించడం జరిగిందని తెలిపారు మంత్రి రామానాయుడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version