బుడమేరు వరద నియంత్రణ పై మంత్రి నిమ్మల కీలక వ్యాఖ్యలు

-

బుడమేరు వరదలతో విజయవాడకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని మంత్రి నిమ్మల రామా నాయుడు అన్నారు. బుడమేరు వరద నియంత్రణ పై అధికారులతో ఆయన విజయవాడలో సమీక్ష నిర్వహించారు. బుడమేరు పాత కాలువ సామర్థ్యం పై చర్చించారు. బుడమేరుకు సమాంతరంగా కొత్త కాలువ తవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు అంచనాలు తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. అంతేకాదు.. ఉప్పుటేరు మార్గాన్ని కూడా వెడల్పు చేయాలని సూచించారు.

జనవరి 18న మరోసారి భేటీ కావాలని పిలుపునిచ్చారు. ఉప్పుటేరు మార్గం వెడల్పు పై ప్రతిపాదనలు రెడీ చేసి సీఎం చంద్రబాబుకు సమర్పించిన తరువాత కేంద్రానికి కూడా పంపుతామని మంత్రి నిమ్మల తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు సూచనల ప్రకారం.. బుడమేరు కార్యచరణకు ప్రణాళికలు రూపొందిస్తామని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెను సవాల్ ను ఎదుర్కొంది. విజయవాడ నగరానికి భారీగా వరదలు వచ్చాయి. వర్షం కారణంగా బుడమేరు వాగు పొంగి ఒక్కసారిగా విజయవాడ పలు కాలనీలలో నీరు ప్రవహించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version