ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా మావోయిస్ట్ లు తగ్గిపోతున్నారు అనే తరుణంలోనే వారు ఎక్కడో ఒక చోట దర్శనం ఇస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఛతీస్ ఘడ్ లో ఎన్ కౌంటర్ల పర్వం కొనసాగుతోంది. గరియబాద్ లో శుక్రవారం మరోసారి భారీ ఎన్ కౌంటర్ జరిగింది. గరియబాద్ జిల్లాలో నేటి ఉదయం ప్రత్యేక దళాలు కూంబింగ్ చేపడుతుండగా.. మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులకు దిగారు.
కూంబింగ్ చేపడుతున్న పోలీసులు కూడా ఎదురు దాడులకు దిగటంతో.. ఆ ప్రాంతం అంతా కాల్పుల మోతతో దద్దరిల్లి పోయింది. గరియబాద్ జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. ఇప్పటివరకూ ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం అందిందని తెలిపారు. అలాగే ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉందని అక్కడి మీడియాకు వెల్లడించారు.