టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రచారకర్తగా సినీ హీరోయిన్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి రోజా సెల్వమణి ఉపయోగపడతారని రఘురామకృష్ణ రాజు అన్నారు. రోజా సెల్వమణి కూటమి ప్రచార కర్తగా ఎలా ఉపయోగపడతారనే అనుమానం అందరికీ రావడం సహజమని ఈ సందర్భంగా గతంలో ఆమె ప్రసంగించిన 30 సెకండ్ల వీడియోను ఆయన ఈ సందర్భంగా మీడియా ప్రతినిధుల ముందు ప్రదర్శించారు. దశలవారీగా మధ్య నిషేధం చేపడుతూ, ఎన్నికల నాటికి పూర్తిగా మద్యాన్ని నిర్మూలించకపోతే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఓట్లు అడగరని పేర్కొన్న రోజా, తన చెల్లి షర్మిల పట్ల ఎటువంటి అనురాగాన్ని ప్రదర్శిస్తారో జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని మహిళల పట్ల ప్రదర్శిస్తారన్నారు.
అంటే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలు వారి తల్లిదండ్రులకు పుట్టలేదని దిక్కుమాలిన దరిద్రపు కొడుకుల చేత సోషల్ మీడియాలో కామెంట్లను పెట్టిస్తారా? అంటూ రఘురామకృష్ణ రాజు ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డి సొంత చెల్లెలు ఇద్దరూ ఇబ్బందులతో రోడ్డున పడ్డారని, ఒకరేమో ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతున్నారని, మరొకరికి సెక్యూరిటీని తగ్గించారని, గతంలో ఉన్న సెక్యూరిటీకి అదనంగా ఇద్దరు గన్మేన్లని ఇచ్చిన వారు కూడా రాష్ట్ర పోలీసు శాఖ సిబ్బందేనని ఆయన పేర్కొన్నారు. మద్య నిషేధం గురించి తండ్రి, కొడుకుల మాటలను విశ్వసించవద్దని గతంలో పేర్కొన్న జగన్ మోహన్ రెడ్డి గారు దశలవారీగా మద్య నిషేధం అమలు చేసి ఎన్నికల నాటికి సంపూర్ణ మద్య నిషేధం అమలు చేయకపోతే ఓట్లు అడగనని పేర్కొన్నారని గుర్తు చేశారు.