అర్హులకు సేవలందించడమే జగనన్న ఆరోగ్య సురక్ష లక్ష్యం : మంత్రి విడదల రజినీ

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే ప్రజారోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రాష్ట్రంలోని ఆసుపత్రులను ఆధునీకరించి వైద్య సేవలను మెరుగుపరిచారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఫ్యామిలీ డాక్టర్ విధానంతో వైద్య సేవలను ప్రజల ముంగిటనే చేర్చారు. ప్రతీ ఒక్కరి ఆరోగ్యం గురించి వాకబు చేసి ముందస్తుగానే ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపట్టారు.

తాజాగా వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజినీ మీడియా సమావేశంలో పలు కీలక విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపైన్ నిన్నటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఆరోగ్య సేవలన్నీ అందించటమే దీని లక్ష్యం అన్నారు. 5 దశలుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. వైద్య ,ఆరోగ్యశ్రీ సేవలు ఎలా వినిగించుకోవాలనేది అవగాహన, సేవలు దశల వారీగా జరుగుతుందని వివరించారు. దాదాపు 45 రోజుల పాటు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం కొనసాగుతుంది. ఇందులో 105 రకాలు మందులు ప్రజలకు అందుబాటులో ఉంటాయి. 3751 కొత్త ప్రొసిజర్స్ తీసుకుని వచ్చినట్టు తెలిపారు. ఇప్పటికే ఫ్యామిలీ డాక్టర్ ఓపి లను 2లక్షల 40 మంది ఉపయోగించుకున్నారు అని వివరించారు మంత్రి విడదల రజినీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version