BREAKING : విశాఖలో ముగ్గురు ఇంటర్ విద్యార్థుల మిస్సింగ్ కలకలం

-

విశాఖ నగరంలో మరో మిస్సింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. విశాఖలో ముగ్గురు ఇంటర్ విద్యార్థుల మిస్సింగ్ కలకలం రేపింది. గాజువాక శ్రీ చైతన్య కళాశాలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు అదృశ్యం అయ్యారు. ఈ నెల 24 వ తేదీన కే. కోటపాడు వెళ్ళిన ముగ్గురు విద్యార్థులు.. అప్పటి నుంచి మిస్సింగ్ అయ్యారు.


కే.కోటపాడు నుంచి తిరుగు పయనం అయినప్పటికీ తిరిగి ఇంటికి చేరుకొని ముగ్గురు విద్యార్థులు.. ఎటు వెళ్లారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇక ఈ మిస్సింగ్ సంఘటనపై గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కే.కోటపాడు పోలీసులు సైతం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. అయిన వారి ఆచూకీ దొరకలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version