ఎమ్మెల్యేగా తప్పులను ఎత్తిచూపినా కూడా కేసులు పెడతారా : చంద్రశేఖర్

-

పేకాట క్లబ్బులను ఆపాలని ట్వీట్ చేస్తే నాపై కేసులు పెట్టారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా పేకాట క్లబ్బులు నడుస్తున్నాయని వారి ఎల్లోమీడియాలో కూడా వార్తలు వచ్చాయి అని ఎమ్మెల్యే చంద్రశేఖర్ అన్నారు. కానీ మేము పోస్టులు పెడితే కేసులు పెడుతున్నారు. ఒక ఎమ్మెల్యేగా తప్పులను ఎత్తిచూపినా కూడా కేసులు పెడతారా అని ప్రశ్నించిన ఆయన.. ఇంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉందా.. ఇలా కేసులు పెట్టటం ప్రభుత్వ పిరికి చర్య అని పేర్కొన్నారు.

అలాగే ప్రభుత్వ తప్పులను ప్రతిపక్షంగా ప్రశ్నించకూడదా అని అడిగిన ఆయన.. పేకాట క్లబ్బులు తెరిపిస్తానని కూటమి ఎమ్మెల్యే పబ్లిక్‌గా ప్రకటించారు. మరి ప్రభుత్వం ఏం చేస్తోంది అన్నారు. యర్రగొండపాలెంలో‌ ఒక గిరిజన మహిళలపై టీడీపీ వారు దాడి చేస్తే పెట్టీ కేసు పెట్టారు. బాధితురాలి మీద తీవ్రమైన సెక్షన్లు పెట్టారు. ఇదేనా కూటమి ప్రభుత్వ పాలన అని అన్నారు. అలాగే ఈ ప్రభుత్వం కొనసాగే అవకాశమే లేదు అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version