తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ముఖ్యంగా డిసెంబర్ చివరి లోపు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తాజాగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రైతులు పండించిన పంటను చివరి గింజ వరకు కొంటామని పేర్కొన్నారు. ఎవ్వరూ అధైర్య పడకూడదని భరోసానిచ్చారు. పంటలకు మద్దతు ధర కల్పిస్తామని హామి ఇచ్చారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేసి తీరుతామన్న ఆయన డిసెంబర్ నెలాఖరు లోపు రూ.13వేల కోట్ల పెండింగ్ బకాయిలను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు.
రైతులందరికీ రుణమాఫీ పూర్తయ్యేంత వరకు విశ్రమించేదే లేదని తెలియజేశారు. అన్ని పంటలకు ప్రభుత్వం మరోవైపు గ్రూపు-1 అభ్యర్థులకు డిసెంబర్ నెలలో నియామక పత్రాలు అందజేస్తామని వెల్లడించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.