వైసీపీకి మరో షాక్‌…జగన్‌ యాత్రకు దూరంగా ఎమ్మెల్యే సిద్దారెడ్డి!

-

శ్రీ సత్యసాయి జిల్లాలో వైసీపీకి మరో షాక్‌ తగిలింది. సీఎం జగన్‌ నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రకు దూరంగా ఎమ్మెల్యే డాక్టర్ సిద్దారెడ్డి ఉంటున్నారు. నిన్న కదిరిలో జరిగిన సిఎం జగన్ రోడ్ షోలో కనపడలేదు ఎమ్మెల్యే డాక్టర్ సిద్దారెడ్డి. అయితే.. కదిరి టిక్కెట్ ఆశించి భంగపడ్డారు ఎమ్మెల్యే సిద్దారెడ్డి.

MLA Dr. Sidda Reddy

కదిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా సిద్దారెడ్డిని కాదని మగ్భూల్ అహ్మద్ పేరు ప్రకటించింది వైసీపీ పార్టీ అధిష్టానం. ఇక టిక్కెట్ల ప్రకటన జరిగినప్పటి నుంచి పార్టీ తో అంటీముంటనట్లుగా వ్యవరిస్తున్నారు ఎమ్మెల్యే డాక్టర్ సిద్దారెడ్డి. ఇక తాజాగా కదిరిలో జరిగిన సిఎం జగన్ రోడ్ షోలో కనపడలేదు ఎమ్మెల్యే డాక్టర్ సిద్దారెడ్డి. దీంతో ఆయన పార్టీ మారుతారని అందరూ అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version