TDP: ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త అరాచకాలంటూ నిన్నటి నుంచి వచ్చిన వార్తలపై క్లారిటీ వచ్చింది. స్వయంగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే ,గల్లా మాధవి భర్త గల్లా రామచంద్రరావు క్లారిటీ ఇచ్చారు. నాపై కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. 27 లక్షలకు పొలం అగ్రిమెంట్ కుదుర్చుకొని 45 లక్షలు డిమాండ్ చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు…గల్లా జయదేవ్ ఇంటిపేరు మా ఇంటిపేరు ఒకటే అనుకొని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారని ఆగ్రహించారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాపై దాడులు తగ్గాయి అనుకుంటే, వైసిపి కి చెందిన వెంకట్రావు అనే వ్యక్తి ఇప్పటికీ నన్ను వదలడం లేదని ఆరోపణలు చేశారు. నాకు వెంకట్రావు అనే వ్యక్తికి ,నేరుగా ఎక్కడ సంబంధాలు లేవు..నాపై ఎందుకు బురద జల్లుతున్నాడో అర్థం కావడం లేదన్నారు. నేను ఎమ్మెల్యే భర్తను అయినంత మాత్రాన, ఎవరికైనా అడిగినంత డబ్బు ఇవ్వాలా… నేను రాజకీయాల్లోకి రాకముందే రియల్ ఎస్టేట్ వ్యాపారిని అన్నారు. నేను వివాదాల్లోకి వెళ్లే వ్యక్తిని కాదు ,వ్యాపారం చేసుకునే వ్యక్తిని…అధిష్టానం ఇచ్చిన అవకాశంతో, నా భార్య ఎమ్మెల్యేగా గెలిచారన్నారు.